డోన్: వైసిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Aug 23, 2026 నంద్యాల జిల్లా డోన్ మండల పరిషత్ నూతన భవనాన్ని సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వైసీపీ నాయకులు ప్రారంభించడం ప్రోటోకాలకు విరుద్ధమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం సరికాదన్నారు.విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమైన చర్యగా విమర్శించారు.