బనగానపల్లె: కోవెలకుంటలో భారీ అగ్ని ప్రమాదం
కోయిలకుంట్ల పట్టణంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఫ్యాక్టరీలోని విలువైన మిషన్లు, పాలిమర్ సంచులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.