మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కోనేరు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని చెన్నకేశవ స్వామి కోనేరు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్చార్జి డిఆర్ఓ వెంకట శివరాం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా కోనేరు చుట్టూ పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.