ఉదయగిరిలో బుధవారం సాయంత్రం ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. చంద్రుడు వెనుక భాగంలో మూడు నామాలతో శివుడు రూపంలో కనిపించడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుడు ఇలా దర్శనమిచ్చారని పలువురు పేర్కొన్నారు. సూపర్ మూన్ నేపథ్యంలో చంద్రుడు ఇలా కనిపించారని మరికొందరు చెప్పారు.