జలదంకి మండలం 9వ మైలు సెంటర్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతూ ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఉత్తరాఖండ్ కు చెందిన వ్యవసాయ కూలీ రామ్ రాయ్ గా గుర్తించారు. వరి నాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. దీంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి వారి స్వగ్రామనికి మృతదేహం వెళ్లేందు కు ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు ఆదేశించారు. జరిగిన ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూనట్లు పోలీసులు తెలిపారు