ఒంగోలు అర్బన్: అర్ ఎల్ పురంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Aug 22, 2026
పరిశుభ్రతతోనే గౌరవం, ప్రత్యేక గుర్తింపు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ' స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ' కార్యక్రమంలో భాగంగా శనివారం చీమకుర్తి మండలంలోని ఆర్.ఎల్. పురం గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీలలో పూడికతీత పనులలో వారు పాల్గొని పరిశుభ్రత విషయంలో స్థానికులలో చైతన్యమునింపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలిపేలా గ్రామంలో మొక్కలు నాటారు. స్థానికంగా ఉన్న ' చెత్త నుంచి సంపద తయారీ కేంద్రా'న్ని కూడా వారు పరిశీలించారు.