గజపతినగరం: గంట్యాడ సచివాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీ: లబ్ధిదారులతో నేరుగా ఫోన్ సంభాషణ
ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ఆధారంగా గంట్యాడ సచివాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ తనిఖీలు నిర్వహించారు. సేవలు, రిజిస్టర్లను పరిశీలించిన జేసీ, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.