ఆళ్లగడ్డ: అనాఫిలిస్ ఆడదామతోనే మలేరియా వ్యాప్తి ఆళ్లగడ్డ వైద్యులు డాక్టర్ నరసింహ, డాక్టర్ గీతిక
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని యూ పీ హెచ్ సీ లో గురువారం దోమలపై అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా డాక్టర్ నరసింహ, డాక్టర్ గీతిక మాట్లాడుతూ అనాఫిలస్ ఆడ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు 1897 లో సర్ రోనాల్డ్ రాస్ ఈ విషయాన్ని కనుగొన్నారు అని వారు తెలిపారు, అనంతరం దోమలపై ర్యాలీ నిర్వహించారు,ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి, దస్తగిరి రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, ఏఎన్ఎం ఆశ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు