శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని 39 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద 26 లక్షల చెక్కులు పంపిణీ చేస్తే ఎమ్మెల్యే
ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 39 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద 26 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరంలాంటిదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు