అదిలాబాద్ అర్బన్: వసతి గృహాలకు సరుకుల ఇండెంట్ ఇకపై UWHMS పోర్టల్ ద్వారానే: అదనపు కలెక్టర్ ఆదేశం
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు సరుకుల సరఫరాలో పారదర్శకత కోసం UWHMS పోర్టల్‌ను తప్పనిసరి చేస్తూ అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా 5వ తేదీలోపు ఇండెంట్ నమోదు చేయాలని, నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపాలని అధికారులకు సూచించారు.