ఒంగోలు అర్బన్: ఒంగోలు డివిజన్ పరిధిలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై ముమ్మర వాహన తనిఖీలు, నేరాల నియంత్రణపై దృష్టి పెట్టినా అధికారులు
Ongole Urban, Prakasam | Oct 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు లోని 16 నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాలను ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గంజాయి మత్తు పదార్థాల తరలింపు నిషేధిత ఉత్పత్తులు పేలుడు పదార్థాలు తరలింపు వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. నేరాలను నియంత్రణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో వాహన తనిఖీలు చేపట్టామని అధికారులు చెప్పారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాలను ప్రజలు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.