కడప జిల్లా కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాను శుక్రవారం రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం యూనిట్ సందర్శించారు.ఈ కార్యక్రమంలో హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, డైరెక్టర్ సాయిల్ కాం పాటి, రైటర్ మెట్టపల్లి సురేంద్ర, ఈటివి నీతిన్, ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య, చైతన్య జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ రాహుల్ మోపిదేవిలు పాల్గొని దర్గ ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం యూనిట్ దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూదర్గాకు రావడం ఆనందంగా ఉందన్నారు.సినిమా హిట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.