పార్వతీపురం: పార్వతీపురంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రూ.2.25 కోట్ల చెక్కుల పంపిణీ
పార్వతీపురం మున్సిపాలిటీలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు డిపాజిట్ డబ్బులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. మొదటి విడతలో 335 మందికి రూ.2.25 కోట్ల చెక్కులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అందజేశారు. మిగిలిన వారికి రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.