అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ రిమ్స్ వెంటిలేటర్ల చోరీ: 4 ప్రత్యేక బృందాలతో పోలీసుల విచారణ
ఆదిలాబాద్ రిమ్స్ వెంటిలేటర్ల చోరీ కేసులో విచారణ వేగవంతమైంది. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకోగా, ఘటనకు బాధ్యులను చేస్తూ 12 మంది వైద్య సిబ్బందికి రిమ్స్ డైరెక్టర్ మెమోలు జారీ చేశారు.