రాయదుర్గం: కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో చలివేంద్రం ప్రారంభించిన ఎస్ఐ సురేష్
రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సిసి విభాగం విద్యార్థుల ఆధ్వర్యంలో 74- ఉడే గోళం వైయస్సార్ సర్కిల్ నందు చలివేంద్రాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎస్సై సురేష్ విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఎన్సిసి సీ.టి.ఓ జక్కల కిరణ్ మాట్లాడుతూ వేసవికాలం ముగిసే వరకు చలివేంద్రాన్ని నిర్వహిస్తామని, మద్దానేశ్వర స్వామి రహదారి , భూపసముద్రం, అనంతపురం రహదారి, రాయదుర్గం పట్టణానికి వెళ్లే మార్గం కూడలి కనుక బాటసారులు మంచి నీటిని తీసుకోవడం వలన వారికి వడదెబ్బ తగలకుండా ఉంటుందని తెలిపారు.