ఒంగోలు అర్బన్: రెవిన్యూయేతర sa.asyalanu రెవిన్యూ విభాగంలో నమోదు చెయ్యకుండా జాగ్రత్త వహించండి : సిసిఎల్ఏ జయలక్ష్మి
Ongole Urban, Prakasam | Aug 24, 2026
రెవెన్యూ గ్రీవెన్స్ ఆర్జీల నమోదు సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని సీసీఎల్ఏ జి.జయలక్ష్మి చెప్పారు. ముఖ్యంగా రెవిన్యూయేతర సమస్యలను రెవెన్యూ విభాగంలో నమోదు చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రోణంకి కూర్మనాథ్ తో కలిసి సోమవారం జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టరేట్లో జరుగుతున్న ' మీకోసం ' కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వచ్చిన ప్రజలకు అర్జీలు రాసి పెట్టడంలో చేస్తున్న సహాయం, వాటిని ఆన్లైన్ చేస్తున్న తీరును జయలక్ష్మి స్వయంగా పరిశీలించారు.