తుని: కాకినాడ జిల్లా తొండంగిలో ఎంపీటీసీ నామినేషన్ వద్ద ఘర్షణ, రాళ్ల దాడి
Tuni, Kakinada | Oct 21, 2026 కాకినాడ జిల్లా తొండంగిలో ఎంపీటీసీ నామినేషన్ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. నామినేషన్ పత్రాల లాగుడు, రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తుని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.