శ్రీశైలం: విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించే వరకు విద్యార్థులను బడికి పంపము
కొత్తపల్లి మండలం కొక్కెరంచ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.. పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.నిన్న నిర్వహించిన విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయని.. నేడు కూడా ఎన్నికలునిర్వహించకపోవడంతో విద్యార్థులతో కలిసి పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారుఅయితే.. నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులకు 67 మంది తల్లిదండ్రులు మద్దతు పలకగా.. టీడీపీ మద్దతుదారులకు 17 మంది మాత్రమే మద్దతు తెలిపారని వైసీపీ మద్దతుదారులు పేర్కొన్నారు.