పూతలపట్టు: కాణిపాకంలో ఓటర్ల జాబితా నోటీసుల పరిశీలన: అధికారులకు కీలక ఆదేశాలు
కాణిపాకం గ్రామ సచివాలయంలో ఓటర్ల జాబితా నోటీసుల విచారణను జిల్లా పరిశీలకులు మల్లికార్జున పరిశీలించారు. నిబంధనలు పాటించాలని బీఎల్ఓలను ఆదేశించిన ఆయన, హాజరుకాని వారికి రెండో విడత నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే 45 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.