పూతలపట్టు: అరగొండ హైస్కూల్లో విద్యార్థులపై కుల వివక్ష ఆరోపణలు: రంగంలోకి దిగిన విద్యాశాఖ
చిత్తూరు జిల్లా అరగొండ హైస్కూల్లో విద్యార్థులపై కుల వివక్ష చూపుతున్నారనే ఆరోపణలపై డీవైఈఓ ఇందిర విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. విచారణా నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.