వరికుంటపాడు మండలంలోని కోటవర్ధన పల్లి లో బెల్ట్ షాపులు తీసివేయాలని మంగళవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో దాదాపు 30 ఇల్లు ఉన్నాయని గ్రామంలో మూడు బెల్టు షాపులు నిర్వహిస్తూ గ్రామస్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు