కాకినాడ రూరల్: కాకినాడ ఎం.ఎస్.ఎన్. క్యాంపస్లో ఘనంగా ఎన్.ఎస్.ఎస్. దినోత్సవ వేడుకలు
కాకినాడలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎం.ఎస్.ఎన్. క్యాంపస్లో ఎన్.ఎస్.ఎస్. దినోత్సవ వేడుకలు జరిగాయి. తుఫాను కారణంగా వాయిదా పడిన ఈ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్స్, నృత్యాలు ఆకట్టుకున్నాయి.