ఉదయగిరి మండలం శకునాలపల్లి సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన సోమవారం జరిగింది.పులాయపల్లికి చెందిన కొందరు కారులో ఎర్రబల్లిగడ్డకు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడడంతో కారులో ఉన్న వారు సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడగా కారు నుజ్జు నజ్జు అయింది