ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాజబాబు, స్థానిక ఎన్నికల కసరత్తుపై సూచనలు
Ongole Urban, Prakasam | Oct 15, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ ఎన్నికలలో పాటించవలసిన నియమాలు జాగ్రత్తలను సిబ్బందికి కలెక్టర్ వివరించారు. నిర్దేశించిన విధంగా విధులను సిబ్బంది నిర్వహించవలసి ఉంటుందని నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి పనులు చేయరాదని కలెక్టర్ అధికారులకు సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.