మధిర: సత్తుపల్లిలో ఘనంగా ముగిసిన రాజశ్యామల యాగం: పాల్గొన్న మంత్రి తుమ్మల దంపతులు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్వర్ణ దేవాలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన రాజశ్యామల యాగం ముగిసింది. చివరి రోజు కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు.