శ్రీశైలం: దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలు భక్తుల కోలాహలం మధ్య ఘనంగా నిమజ్జనం
దసరా పండుగను పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణంలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని అమ్మవారి శాల, శివాలయం అమ్మ భవాని, గరీబ్ నగర్, వెంగల్ రెడ్డి కాలనీ, కిషన్ సింగ్ వీధి ప్రాంతాలలో దసరా నవరాత్రి అమ్మవారిని వివిధ రూపాలలోని విగ్రహాలను ప్రతిష్టించారు. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజూ అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు