రాయదుర్గం: బొమ్మనహాల్ పిహెచ్సి ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
బొమ్మనహాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లో సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారి, వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆయనతోపాటు స్థానిక మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.