వింజమూరు మండలం చద్రపడియాలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం రైతన్న సేవ కోసం స్వయంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో ఇప్పటికే రైతుల ఖాతాల్లో 14వేలు జమ చేయగా మరో విడత 6 వేలు అందించెందేకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సబ్సిడీతో లిఫ్ట్ ఇరిగేషన్, వ్యవసాయ యంత్రాలు అలాగే యూరియా వస్తాను కేవలం 270 రూపాయలకే అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు