పూతలపట్టు: తవణంపల్లిలో ఆటోను, ట్రాక్టర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
తానంపల్లి మండలంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది మాధవరం వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. స్థానికులు గుర్తించి వెంటనే అరగొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ తో డ్రైవర్ పరారయ్యాడు. పోలీసు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది