రామచంద్రపురం: సూర్యానగర్లో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్
రామచంద్రపురం సూర్యానగర్లో ట్రాన్స్ఫార్మర్ జంక్షన్ బాక్స్ తుప్పుపట్టి, రక్షణ గోడ శిథిలావస్థకు చేరడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.