మంచిర్యాల: సీసీ నస్పూర్ రోడ్డు ప్రమాదం: నలుగురు మృతిపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణ
సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.