జగిత్యాల: జగిత్యాలలో ఘనంగా అంబేద్కర్ స్మరణ కార్యక్రమం
జగిత్యాల అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్మరణ కార్యక్రమం జరిగింది. విద్యా చైతన్యం, సామాజిక న్యాయంపై డాక్టర్ వేణు గోపాల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా భాయ్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.