శ్రీశైలం: బండిఅత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో విషాద ఘటన. ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య
బండిఅత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ దంపతులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను ఈర్నపాడుకు చెందిన గోపాల్, రమణమ్మ దంపతులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దంపతుల ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.