పార్వతీపురం: మన్యం జిల్లాలో పెను వరద ముప్పును తప్పించిన మంత్రి సంధ్యారాణి వ్యూహం!
అర్నాబ్ వాయుగుండం సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీసుకున్న ముందస్తు చర్యల వల్ల 22,124 క్యూసెక్కుల చారిత్రాత్మక వరద నుంచి జిల్లా సురక్షితంగా బయటపడింది. జంఝావతి రబ్బర్ డ్యామ్ ను డెఫ్లేట్ చేయడంతో పాటు వాగుల నీటిని చెరువులకు మళ్లించి పంటలను కాపాడారు.