ఒంగోలు అర్బన్: ధనియాల మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. భారీగా నిల్వల స్వాధీనం.
Ongole Urban, Prakasam | Sep 20, 2026
ప్రకాశం జిల్లాలో కల్తీ ధనియాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ధనియాల ప్రాసెసింగ్ మిల్లులపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు మిల్లుల్లో ధనియాలకు కృత్రిమ రంగులు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాడుల్లో భారీగా ధనియాల నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 18 లక్షల 20 వేల రూపాయల విలువైన 14 వేల కిలోల ధనియాలను సీజ్ చేశారు. ధనియాలకు రంగులు కలిపి వాటిని ఆకర్షణీయంగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.