ముధోల్: భైంసాలో ప్రశాంతంగా ముగిసిన దుర్గామాత నిమజ్జనోత్సవం
Mudhole, Nirmal | Oct 22, 2026 భైంసాలో దుర్గామాత నిమజ్జనం భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. భక్తులు శోభాయాత్రగా విగ్రహాలను గడ్డన్న ప్రాజెక్టు వద్ద నిమజ్జనం చేశారు. సహకరించిన ప్రజలకు పోలీసు శాఖ కృతజ్ఞతలు తెలిపింది.