నంద్యాల అర్బన్: నంద్యాల ఆర్ ఆర్ఎస్, మార్కెట్ యార్డును కాపాడాలి: రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి
Nandyal Urban, Nandyal | Aug 22, 2026
RARS భవనాల నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను వెంటనే ఖాళీ చేసి, వ్యవసాయ పరిశోధనలకు ఆ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో అప్పగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష ఐక్య వేదిక నేతలు శనివారం నూనెపల్లె మార్కెట్ యార్డ్‌ను సందర్శించారు. టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.