ఖమ్మం అర్బన్: ఖమ్మం: మామిళ్లగూడెంలో వరుస పెట్రోల్ చోరీలు.. ఆందోళనలో వాహనదారులు
ఖమ్మం మామిళ్లగూడెంలోని బస్ డిపో వెనుక కాలనీలో పెట్రోల్ చోరీలు కలకలం రేపుతున్నాయి. పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ దొంగిలిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను పట్టుకుని, పోలీసులు గస్తీని పెంచాలని స్థానికులు కోరుతున్నారు.