వాజేడు: వాజేడులో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
ములుగు జిల్లా వాజేడు మండలంలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నేల ఆరోగ్య కార్డుల సిఫారసుల మేరకు రసాయన ఎరువుల వినియోగం మరియు పశువుల ఎరువు, జీవామృతం ప్రాముఖ్యతపై రైతన్నలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు పాల్గొన్నారు.