ఏటూరునాగారం: నవంబర్ 17న సీపీఎస్ ఉద్యోగుల సామూహిక సెలవు: పాత పెన్షన్ కోసం ధర్మదీక్షలు
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవు (Mass CL) పాటించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. ములుగులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ ఈ విషయాన్ని ప్రకటించారు.