మచిలీపట్నం దక్షిణం: గూడూరులో తుఫాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు: అత్యవసర సహాయం కోసం సంప్రదించండి
Machilipatnam South, Krishna | Oct 25, 2026
అర్నబ్ తుఫాను ముప్పు నేపథ్యంలో గూడూరు తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాను సమస్యలు ఎదురైతే ప్రజలు ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చునని తహశీల్దార్ డి. రాజ్యలక్ష్మి తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.