నందికోట్కూరు: 149వ రోజుకు చేరిన శ్రీశైలం నీటి ముంపు బాధితుల దీక్ష లు
నంద్యాల జిల్లా నందికొట్కూరు కృష్ణ జలాలను తరలించుకుని హంద్రీనీవా కాలువ పనులపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసిన శ్రీశైలం నీటి ముంపు బాధితుల పట్ల కూటమి ప్రభుత్వం చూడకపోవడం బాధాకరమని శ్రీశైలం నీటి ముంపు బాధితుడు జయన్న ఆవేదన వ్యక్తం చేశారు, శుక్రవారంతో శ్రీశైలం నీటి ముంపు బాధితుల దీక్ష 149వ రోజుకు చేరుకుంది, తక్షణమే జీవో 98 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు