డోన్: డోన్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల దాడులు
Dhone, Nandyal | Oct 24, 2026 డోన్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. బేతంచెర్లలో 12, డోన్‌లో 8 మద్యం సీసాలు, ప్యాపిలి మండలం నల్లమేకలపల్లిలో 4 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపుపై కేసు నమోదు చేయడంతో పాటు ఐదుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం విక్రయాలు, నాటుసారా తయారీపై కఠిన చర్యలు తీసుకుంటామని డోన్ ఎక్సైజ్ CI జఫ్ఫుల్లా, ఎస్ఐలు దౌలత్ ఖాన్, సోమశేఖర్ హెచ్చరించారు.