ఒంగోలు అర్బన్: సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.apk యాప్ lu ఇన్స్టాల్ చెయ్యవద్దు : జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Aug 21, 2026
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీకే యాప్లను ఎవరు ఇన్స్టాల్ చేయవద్దని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు సూచించారు సైబర్ నేరగాలని రకరకాలుగా నేరాలకు పాల్పడడమే కాకుండా ఆశ చూపి అకౌంట్లో నగదును ఖాళీ చేస్తారని దీని పట్ల అప్రమత్తత అవసరమన్నారు ఆన్లైన్ చాటింగ్ చేసేటప్పుడు పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడడమే కాకుండా ఆన్లైన్ అరెస్టు పేరుతో బెదిరింపులకు పాల్పడతారన్నారు ఆన్లైన్లో ఎవరు అరెస్టు చేసేదేమీ ఉండదని అటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు ప్రజలు ఆన్లైన్లో చీటింగ్లోకు పాల్పడేటువంటి ముఠాలపట్ల అప్రమత్తత అవసరమన్నారు