గద్వాల్: గద్వాల: కులాంతర వివాహం చేసుకున్న 13 జంటలకు రూ.32.50 లక్షల ప్రోత్సాహకం!
గద్వాల జిల్లాలో 13 కులాంతర వివాహ జంటలకు ప్రభుత్వం రూ.32.50 లక్షల ప్రోత్సాహక బహుమతులను అందజేసింది. ఒక్కో జంటకు రూ.2.50 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పంపిణీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఈ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లుగా అందించబడింది.