ఉప్పల్ మినీ శిల్పారామం లో సారీస్ అఫ్ ఇండియా మేళ సందర్బంగా శనివారం కుమారి శివాని వాణి గారి శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, బ్రహ్మాంజలి, జతిస్వరం, తాండవ నృత్యకారి, శ్రీ లలిత హారతి, శివాష్టకం, గరుడ గమన, శ్యామలే మీనాక్షి, శ్రీమాన్ నారాయణ, అంతయు నీవే, మూషిక వాహన, జగడపు, పలుకే బంగారమాయెనా అంశాలను శ్రీ వర్షిణి, శ్రీకరీ, సప్నా, రాధా, వైష్ణవి, రేవతి , పర్ణిక, ఉద్విత, కావ్య, వెన్నెల, వర్ష, ప్రణయ, శరణ్య, సేజల్ , దేవంశీ మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.