రాజోలు: సఖినేటిపల్లిలో భారీ వర్షం: జలమయమైన లోతట్టు ప్రాంతాలు
సఖినేటిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజకీయ పార్టీల కార్యక్రమాలకు ఈ వర్షం అంతరాయం కలిగించింది.