కాకినాడ సిటీ: డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించండి: ఎమ్మెల్యే కొండబాబుకు ద్వారంపూడి సవాల్
కాకినాడ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కొండబాబుకు దమ్ముంటే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన సవాల్ విసిరారు. విమానాశ్రయాలు, నిఘా సంస్థలు కేంద్రం పరిధిలో ఉంటాయని ఆయన గుర్తు చేశారు.