రాయదుర్గం: వడ్రహొన్నూరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
రాయదుర్గం మండలంలోని వడ్రహొన్నూరు గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో పంచాయతీ నిధులతో బోరు వేయించారు. బోరు బావిలో నీరు పుష్కలంగా పడటంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం బోరుకు మోటార్ బిగించి నీటిని పంపింగ్ చేసినట్టు పంచాయతీ సర్పంచ్ అశోక్ తెలియజేశారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య తీరుతుందని వెల్లడించారు. సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.