రాయదుర్గం: పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బళ్లారి రోడ్డు నుంచి వినాయక కూడలి, లక్ష్మీబజార్ మీదుగా మద్దానేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.